నదిలో పడిన బస్సు..26 మంది మృతి
- December 23, 2017
జైపూర్: బస్సు నదిలో పడి 26 మంది మృతి చెందిన ఘటన రాజస్థాన్ రాష్ట్రం సవాయ్ మాధోపూర్ లోని దుబి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. బస్సు వంతెన పైనుంచి పోతున్నప్పుడు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 26 మంది దుర్మరణం చెందగా 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 2010, మార్చిలో సవాయ్ మాధోపూర్‌లోని మోరెల్ నదిలో బస్సు పడిపోవడంతో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







