ఘనంగా పీవీ నరసింహారావు వర్ధంతి వేడుకలు

- December 23, 2017 , by Maagulf
ఘనంగా పీవీ నరసింహారావు వర్ధంతి వేడుకలు

హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని జ్ఞానభూమి వద్ద పీవీకి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు. జూన్ 28, 1921న జన్మించిన పీవీ నరసింహారావు 2004, డిసెంబర్ 23న స్వర్గస్తులైనారు. పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పీవీ.. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా సేవలందించారు. కేంద్ర రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని.. ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన గొప్ప వ్యక్తి పీవీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com