నదిలో పడిన బస్సు..26 మంది మృతి

- December 23, 2017 , by Maagulf
నదిలో పడిన బస్సు..26 మంది మృతి

జైపూర్: బస్సు నదిలో పడి 26 మంది మృతి చెందిన ఘటన రాజస్థాన్ రాష్ట్రం సవాయ్ మాధోపూర్ లోని దుబి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. బస్సు వంతెన పైనుంచి పోతున్నప్పుడు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 26 మంది దుర్మరణం చెందగా 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 2010, మార్చిలో సవాయ్ మాధోపూర్‌లోని మోరెల్ నదిలో బస్సు పడిపోవడంతో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com