నాగబాబు, రోజా పక్కన ఎలా కూర్చుంటున్నాడంటూ పవన్ ఫ్యాన్స్ మండిపాటు
- December 23, 2017
రోజూ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.. నాగబాబు, రోజా పక్కన ఎలా కూర్చుంటున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏదో ఒక మాట అనడానికి అని రోజా ఎదురు చూస్తుంటుందని, సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలవడం ఆమెకి అలవాటని రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పనిలో పనిగా నాగబాబుపై కూడా ఫైర్ అవుతున్నారు. ఓ ప్రముఖ ఛానెల్లో వస్తున్న జబర్థస్త్ షోలో రోజా, నాగబాబు జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తమ్ముడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా నాగబాబు షో నుంచి తప్పుకోవట్లేదని అంటున్నారు. ఇంతకు ముందులాగానే రోజాతో కలిసి షో చేస్తుడడంతో అభిమానులు తట్టుకోలేపోతున్నారు. అయితే నాగబాబు మాత్రం రోజా రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేసిందే కాని.. వ్యక్తిగతంగా మామధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ..అలాగని సాన్నిహిత్యం కూడా లేదన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







