ఎపిలో ఉగాదే నూతన సంవత్సరం

- December 23, 2017 , by Maagulf
ఎపిలో ఉగాదే నూతన సంవత్సరం

విజయవాడ: ఆలయాల్లో నూతన సంవత్సరం అలంకరణలను, వేడుకలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నిషేధించింది. నూతన సంవత్సరం దర్శనాలపై కూడా నిషేధం పెట్టింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ అయింది.

దాంతో 2018 జనవరి 1వ తేదీన ఆలయాల్లో నూతన సంవత్సరం ప్రత్యేకతలు ఏవీ అమలు కావు. ఉగాదిని నూతన సంవత్సరంగా పరిగణించాలని, ఇంగ్లీష్ క్యాలెండర్ల స్థానంలో తెలుగు సంవత్సరాల క్యాలెండర్‌ను పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఇంతకు ముందు జనవరి 1వ తేదీన ఆలయాల్లో పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఇక అవి జరగవు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ క్యాలెండర్‌ను పాటిస్తూ వస్తున్నారని దేవాదాయ సాఖ హిందు ధర్మ ప్రచార ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు అన్నారు.

నూతన సంవత్సర వేడుకలు హిందూ వైదిక సంస్కృతి కాదని అన్నారు. నూతన సంవత్సరాదిన వేలాది మంది భక్తులు వస్తుండడంతో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తూ వచ్చారు. ఆ సంప్రదాయానికి అంతం పలకాలని కమిషన్ వైవి అనురాధ అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com