స్వచ్ఛంద సంస్థ చిన్నారులతో చరణ్ ఉపాసన ల క్రిస్మస్ వేడుక..!!

- December 23, 2017 , by Maagulf
స్వచ్ఛంద సంస్థ చిన్నారులతో చరణ్ ఉపాసన ల క్రిస్మస్ వేడుక..!!

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా వెండి తెరపై హీరోగా రామ్ చరణ్ చిరుత సినిమాతో అడుగు పెట్టాడు.. తండ్రి వారసత్వం ఒక్క నటనలోనే కాదు.. మంచితనం.. మానవత్వం అని కూడా చరణ్ తన ప్రతి పనిలోనూ చూపిస్తున్నాడు. మెగా అభిమానులతో తండ్రి చిరంజీవి ఏ విధంగా సమావేశం నిర్వహిస్తూ.. వారు ఆపదలో ఉన్న సమయంలో ఆదుకొనే వాడో.. అదే ఆనవాయితీ చరణ్, అర్జున్ లు కొనసాగిస్తూనే ఉన్నారు.. ఇక రామ్ చరణ్ ఎవరు సహాయం అడిగినా కాదనకుండా చేస్తారు అని ఇండస్ట్రీ టాక్.. అంతేకాదు.. భార్య ఉపాసన తో కలిసి దసరా సమయంలో ఛారిటీ ట్రస్ట్ కు వెళ్ళి.. అక్కడ చిన్నారులతో బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు.. కాగా తాజాగా క్రిస్మస్ వేడుకలను పురష్కరించుకొని చరణ్, ఉపాసన దంపతులు సీక్రెట్ శాంతా వేడుకలో పాల్గొన్నారు. ఈ దంపతులు అక్షయ-ఆకృతి ఛారిటీ వద్దకు వెళ్లి.. సందడి చేశారు.. అక్కడ ఉన్న పిల్లలతో కలిసి రామ్ చరణ్ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు.. వారితో ఆడిపాడాడు.. ఈ వీడియోను ఉపాసన తన ఫేస్ బుక్ లో షేర్ చేయగా..మెగా అభిమానుల షెర్స్ తో హల్ చల్ చేస్తోంది. ఉపాసన ఈ వీడియో ను షేర్ చేస్తూ... చిన్నారులు మా పై అమితమైన ప్రేమ, అప్యాయతను చూపించడం చాలా సంతోషంగా ఉంది. మిస్టర్ సి(చెర్రీ) అటాచ్ మెంట్ ఇంతలా ఎందుకు కుదిరిందో త్వరలో మీకు తెలుస్తుంది అంటూ ఆ వీడియోకి ఓ ట్వీట్ ని కూడా జతచేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com