‘దండుపాళ్యం’ దర్శకుడి సినిమాలో శర్వానంద్
- December 23, 2017
విభిన్న చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. సౌత్ లో సంచలనం సృష్టించిన దండుపాళ్యం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రాజుతో శర్వా ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనివాస్ రాజు స్వయంగా ప్రకటించారు. ఇటీవల దండుపాళ్యం 3 ట్రైలర్ ను రిలీజ్ చేసిన శ్రీనివాస్ రాజు, త‍్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నానని వెళ్లడించారు. తన తొలి తెలుగు సినిమాను విలక్షణ నటుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ రాజు ‘ప్రస్తుతం శతమానం భవతి, మహానుభావుడు లాంటి ఫ్యామిలీ సినిమాలు చేస్తున్న శర్వా, దండుపాళ్యం లాంటి క్రైం థ్రిల్లర్ తెరకెక్కించిన నా కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. మా కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఆ అంచనాలు అందుకుంటుంది. అంతేకాదు ఈసినిమా శర్వానంద్ కెరీర్ లోనే భారీ చిత్రమవుతుంద’ని తెలిపారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పూర్తియిన వెంటనే శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో సినిమా ప్రారంభకానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల