బీహారీ దొంగను పట్టిచ్చిన నయనతార
- December 23, 2017
బీహార్‌లో ఓ నేరస్తుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన నాయకుడుకి చెందిన సంజయ్ కుమార్ సెల్‌ఫోన్‌ను మహ్మద్ హసైన్ దొంగిలించాడు. సంజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పట్టుకునేందుకు పథకం వేశారు. అందులో సీనియర్ అధికారిణి మధుబాలా దేవి అతని కాల్ డేటా రికార్డును ట్రేస్ చేశారు. ఓ ప్రేమికురాలిగా నటిస్తూ అతడికి సందేశాలు పంపించారు. మొదట మహ్మద్ స్పందించలేదు. కానీ అటు పక్క ఉన్న మధు మధురంగా మాటల్లో దింపేసరికి ముగ్గులో పడిపోయాడు.
స్పందించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోను పంపించాలని అడిగాడు. ఆ సమయం కోసమే వేచి చూస్తున్న మధుబాల సినీ నటి నయన తార ఫొటోలను పంపించారు. ఎగిరి గంతేసిన దొంగ తనని కలుసుకాలని ఉందంటూ ఓ మంచి రోజుని ఫిక్స్ చేశాడు... ఇంకేముంది ఆరోజు రానేవచ్చింది. పోలీసు అధికారులు సాధారణ వ్యక్తుల్లా దుస్తులు ధరించి మహ్మద్ రమ్మన్న ప్రదేశానికి చేరుకున్నారు. ముసుగు ధరించి వెళ్లిన మధుబాలా దేవి మహ్మద్‌ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మధుబాల దొంగను పట్టుకున్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







