క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన చంద్రబాబు....!!
- December 23, 2017
ఏపీ రాజధానిలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. గుంటూరులోని లూథరన్ స్కూల్ గ్రౌండ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిరోజు కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీని ఆవిష్కరించారు. క్యాండిల్ వెలిగించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
సేవ, కరుణ, ప్రేమను బోధించేందుకే ఏసుక్రీస్తు మానవరూపంలో జన్మించారని చంద్రబాబు అన్నారు. క్రిస్టియన్ల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో చర్చిల మరమ్మతులకు మూడు నుంచి ఐదు లక్షల చొప్పున కేటాయిస్తామన్నారు. చొప్పున కేటాయిస్తామన్నారు. వచ్చే క్రిస్మస్ నాటికి గుంటూరులో ఏపీ క్రిస్టియన్ భవన్ సిద్ధం చేస్తామన్నారు చంద్రబాబు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మంత్రులు, ప్రజా ప్రతినిధులతోపాటూ వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్కెస్ట్రా బృందం క్రిస్మస్ పాటలతో అలరించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







