రాష్ట్ర టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం

- December 23, 2017 , by Maagulf
రాష్ట్ర టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం

విజయవాడ: స్పోర్ట్స్‌ అథారిటి ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, గోల్డ్‌ స్లామ్‌ స్పోర్ట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో తొలి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి టెన్నిస్‌ ర్యాంకింగ్‌ చాంపియన్‌షిప్‌ను శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టెన్నిస్‌ స్టేడియంలో క్రీడల మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ పోటీలు క్రీడాకారులకు మంచి సదావకాశమన్నారు. ప్రభుత్వం నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాప్‌ ఓఎస్‌డీ పి.రామకృష్ణ, డీఎస్‌డీవో బి.శ్రీనివాసరావు, గోల్డ్‌స్లామ్‌ స్పోర్ట్స్‌ ఎండీ తిరుమల రాజు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com