మాదకద్రవ్య మాత్రలు అక్రమ రవాణా చేయబోయి పట్టుబడిన నిందితుడు

- December 23, 2017 , by Maagulf
మాదకద్రవ్య మాత్రలు అక్రమ రవాణా చేయబోయి పట్టుబడిన నిందితుడు

కువైట్ : కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 త్రమడా మాదక ద్రవ్య మాత్రలు అక్రమ రవాణా చేయబోయిన ఒక అరబ్ నిందితుడు కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. శరీరంలోపల దాచుకొన్న ఆ నిందితుడు విమానమెక్కేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఎక్స్ రే  వ్యవస్థ ద్వారం గుండా దాటివెళ్లాల్సినపుడు ఆ అరబ్ వ్యక్త్తో శరీరంలో ఏదో రహస్యంగా దాచుకొన్నట్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లోని  కస్టమ్స్ అధికారులు గమనించారు, దాంతో నిందితుడిని ఫర్వానియా ఆసుపత్రికి తరలించబడింది, అక్కడ వైద్యులు అతని శరీరంలో కనుగొన్నారు.200 త్రమడా మాదక ద్రవ్య మాత్రలతో పాటు మరో  రెండు హాషితో మాదక ద్రవ్య పొట్లాలు  వైద్య పర్యవేక్షణలో తొలగించబడ్డాయి. తదుపరి చర్య కోసం ఆ వ్యక్తిని సంబంధిత అధికారులకు తీసుకువెళ్లారు. అలాగే మరో కేసులో డ్రగ్స్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ కు ఇద్దరు ఆసియా దేశస్తులు తమ వెంట  23 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు మరియు 65 నీటి సీసాల మధ్య ఆ మద్యం బాటిళ్ల నడుమ వాటిని ఉంచినట్లు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com