క్రిస్మస్ స్పెషల్ స్టోరీ.. ఉదయించిన నీతి సూర్యుడు

- December 24, 2017 , by Maagulf
క్రిస్మస్ స్పెషల్ స్టోరీ.. ఉదయించిన నీతి సూర్యుడు

ప్రతి ఏటా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు యేసు ప్రభుని జన్మదినాన్ని ఓ పండుగగా, ఓ మహోత్సవంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. యేసుక్రీస్తు జన్నించటానికి కొన్ని శతాబ్దాల మునుపే ప్రవక్తలు, భక్తులు ఆయనను నీతి సూర్యుడని ప్రస్తుతించారు. మలాకీ అనే భక్తుడు దేవుని నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడని, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయని ప్రవచించారు. అతనికి ముందు యెషయా అనే మరో దైవజనుడు ఆ నీతి సూర్యోదయం జరిగినప్పుడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారనీ, ఆ వెలుగు మరణచ్ఛాయగల దేశ నివాసుల మీద ప్రకాశిస్తుందని తెలియజేశాడు. తమస్సు నుండి జ్యోతి లోనికి నడిపించేవాని కొరకు, అతని ఆగమనం కొరకు అనేక భక్తులు ఎదురుచూశారు, ప్రార్ధించారు. ఆ ప్రార్థనల నిరీక్షలకు జవాబు జగత్ జ్యోతియైన యేసుని జననం. డిసెంబర్ 25న స్పష్టమైన సూర్యుని జన్మదినంగా భావించి పూజించిన రోజునే నీతి సూర్యుడైన యేసుని జన్మదినంగా ఎంచి ఆయనను పూజించటం ప్రారంభించారు. యేసు నీతి సూర్యుడు. లోకాన్ని ఆవరించిన చీకటిని పారద్రోలి లోకాన్ని వెలిగించేందుకు ఆయన వచ్చాడు. యేసు నోటి నుండి వెలువడిన సప్త మహా వాక్యాలను, అహమేవ (నేను నేనే) అనే పదంతో ప్రారంభమయ్యే వాక్యాలలో ఒకటి ‘నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడువక, జీవపు వెలుగు కలిగి ఉందురు. ఆయనతో మూడున్నర సంవత్సరాలు సహవసించి ఆయనను క్షుణ్ణంగా ఎరిగిన ఆయన శిష్యుడొకరు ఆయన జీవిత కథను గ్రంథస్థం చేస్తూ ఊపోద్ఘాతంలో ‘ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. కాని చీకటి దాని గ్రహించలేదు. నిజమైన వెలుగు ఆయన యేసు లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నాడు’ అని రాస్తాడు.యేసుక్రీస్తు నరావతార ఉద్ధేశాలను గమనిస్తే ఒకటి ప్రధానంగా కనపడుతుంది. పాపి విమొచన, దీన జనోద్ధరణ, ఆయనను నిందిస్తూ విరోధులు హేళనగా పాపులను చేర్చుకొని వారితో మిత్రత్వం చేస్తున్నాడని చెప్పినా అదే ఆయన నరావతార ఉద్ధేశం. దుశ్టుడు తన దౌష్ట్యాన్ని గుర్తించి ఆ జీవితానికి స్వస్థి పలికి నీతియుక్తమైన జీవితాన్ని జీవించటానికి అవసరమైన సహాయాన్ని, శక్తిని అనుగ్రహించుట ద్వారా వారిని విమోచిస్తాడు. ఆయన దుష్టులను, పాపులను విమోచించుటకే వచ్చాడు అనే సత్యాన్ని అనుభనించి తెలుసుకున్న పోలు అనే వ్యక్తి చేప్పిన మాట ‘పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మతగినది. పూర్ణాంగీకారమునకు తగినది. ఈ మాట అనుభవజ్ఞానం చెప్పిన గొప్ప మాట. ఒకప్పుడు హానికరుడు, దోషకారుడు, హింసకుడైన తనను యేసు తన దివ్య దర్శనముతో ఏలాగు నూతన జీవితాన్ని ప్రసాదించాడో ఓ సాక్షిగా, వ్రాతపూర్వకంగా తెలియజేశాడు. యేసుప్రభువే తన నరావతార ఉద్ధేశాన్ని తెలుపుతూ ‘నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను ఈ లోకమునకు వచ్చితిని’ అని చెప్పాడు. ఇంకా ఆయన తన రాక ఉద్దేశాన్ని తెలుపుతూ తాను ఓ మంచి కాపరిననీ, గొర్రెనకు అనగా నరగొర్రెనకు సమృద్ధ జీవము యుచ్చుటకు నచ్చానని, ఆ సమృద్ధ జీవము తన బలియాగము ద్వారా కలుగుతిందని వివరణ ఇచ్చాడు. యేసు అనతరణతత్త్వాన్ని లక్ష్యాన్ని తెలియజేసే ప్రకటన ఇది.

నజరేతు అనే ఊరిలోగల ఓ ప్రార్ధనా స్థలంలో బీదలకు శుభకరమైన వర్తమానములు ప్రకటించుటకు, చెరలోనున్నవారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపునిచ్చుటకు, నలిగిన వారిని విడిపించుటకు తన తండ్రియైన దేవుడు తనను అభిషేకించి పంపియున్నాడని తెలియజేశాడు. పేద దళిత జనోద్ధరణే తన నరావతార ఉద్ధేశమని నిర్ధ్వంద్వంగా ఆయన తెలియజేశాడు. తాను గర్భస్థ శిశువుగా వుండగోనే ఆయన పుట్టుక దీనులకు బీదలకు ఎట్లు దీనెనకరంగా ఉంటుందో ఒక గేయ రూపంలో హృద్యంగా వివరించింది. ఆయన గర్వాంధులను చెదరగొట్టుతాడు. దీనులను ఉద్ధరిస్తాడు. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టి వారిని అందలమెక్కిస్తాడని కొనియాడింది. దీనులలో వుండే దివ్యత్వాన్ని వెలికితీసే ప్రయత్నం చేశాడాయన. దీనులైన వికలాంగుల పట్ల రోగుల పట్ల అన్నార్తుల పట్ల ఆయన చూపిన ఆదరణ అపూర్వమైంది.

మొదటి శతాబ్దంలో సమాజం వర్గ సమాజంగా చీలిపోయింది. సాంఘిక తారతమ్యలు పాటించబడ్డాయి. ధనంతో పాటు యాజకత్వము, వేద పరిజ్ఞానం లేనివారిని, ధనిక వర్గానికి చెందని బీదలను ‘భూమిపుత్ర’ అని పిలువబడి, హీనంగా చూడబడ్డారు. నరవాతారిగా ఉన్నప్పుడు ఆయన ఈ భుమిపుత్ర లేక బహుజనులతో మమేకమయ్యాడు. అట్టివారిలో కొందరిని ఆయన తన శిష్యులుగా వుండటానికి పిలిచాడు. వెలివేయబడ్డ వారి ప్రక్కన నిలిచి వారిని ఉద్ధరించాడు. వారితో కలిసి తిరగటం, కలిసి భోజనం చేయడం, బోధించడం, స్వస్తి చేయటం నేరాలుగా ఆయన విమర్శకులు తలంచారు. అలా కలిసి తిరగటం ఆయన సమర్థించుకోవటమే కాక దళిత దీన జనోద్ధరణ పధకంలో తనతో పాలిభాగస్తులు కావాలని తన విమర్శకులను ఆహ్వానించాడు. మరియ కుమారుడు బీదలను, దీనులను దోచుకోనే దోపిడీ వర్గానికి ఓ సవాలు. ప్రతి క్రిస్మస్ విమోచనా ఆధ్యాత్మిక, పోరాడే ఆధ్యాత్మికతను అలవరచుకోమని సకల మానవాళిని సవాలు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com