ఇండియాలోనే ఫస్ట్.. బెంగళూరు సిటీ లోగో

- December 25, 2017 , by Maagulf
ఇండియాలోనే ఫస్ట్.. బెంగళూరు సిటీ లోగో

దేశంలో ఫస్ట్‌టైమ్ అఫీషియల్ లోగోని ఏర్పాటు చేసుకుంది బెంగుళూరు సిటీ. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ లోగోను రూపొందించారు. ఎరుపు, తెలుగు రంగుల్లో కన్నడ, ఇంగ్లీష్ లిపిలో రాసిన లోగోని ఆదివారం కర్ణాటక టూరిజం మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే ఆవిష్కరించారు. ఈ లోగోతో న్యూయార్క్‌, మెల్‌బోర్న్‌, సింగపూర్ సిటీల సరసన బెంగళూరు చేరింది.

ఒక కాంటెస్ట్ నిర్వహించి ఈ లోగోను ఎంపిక చేసింది నిపుణుల బృందం. దీన్ని నమ్మూరుకి చెందిన వినోద్‌కుమార్ డిజైనర్ చేశాడు. ఇంగ్లీష్ అక్షరాలను కన్నడ లిపి మాదిరిగా కనిపించేలా ఈ లోగో డిజైన్ చేశారు. అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాల్లో బెంగళూరు బ్రాండ్‌ను ఈ లోగో సుస్థిర పరచనుందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com