క్రైస్తవుల విద్య, ఉపాధికి అధిక ప్రాధాన్యం: బాబు
- December 25, 2017
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు విజయవాడ: రాష్ట్రంలో క్రైస్తవుల విద్య, ఉపాధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా విజయవాడలోని సెయింట్‌పాల్ కేథడ్రల్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. చర్చి బిషప్ జోసెఫ్ రాజారావు, ఇతర పాస్టర్లు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయనకు ఆశీర్వాదం అందజేశారు. తెలుగు ప్రజలకు, క్రైస్తవులకు ప్రభుత్వం తరపున చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏసుక్రీస్తు ఆశీర్వాదం అందజేయాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు. సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, తమ జీవితాన్ని సేవ కోసం అంకింతం చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







