దిల్లీ మెట్రో: మెజంటా లైన్‌ను ప్రారంభించిన మోదీ

- December 25, 2017 , by Maagulf

కేజ్రీవాల్‌కు అందని ఆహ్వానం.. యోగీ హాజరు దిల్లీ : దేశరాజధాని వాసులకు క్రిస్మస్‌ కానుక. దిల్లీ మెట్రో రైలు నెట్‌వర్క్‌లోని మెజెంటా లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అనంతరం రైలులో కొద్ది దూరం ప్రయాణించారు. దేశరాజధానిని నోయిడాతో ఈ మార్గం కలుపుతోంది. 12.6 కి.మీ పొడవైన ఈ మార్గం దక్షిణ దిల్లీలోని కల్‌కాజీ నుంచి నోయిడాలోని బొటానికల్‌ గార్డెన్‌ వరకూ ఉంది. అయితే ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆహ్వనించలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమానికి మోదీతోపాటు హాజరయ్యారు. దీనిపై ఆప్‌ నేతలు మండిపడ్డారు. రాజకీయ విబేధాల కారణంగానే కేజ్రీవాల్‌ను ఈ కార్యక్రమానికి పిలవలేదని దుయ్యబట్టారు. ఇది భాజపా నేతల చౌకబారు మనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ ఏడాదిలో మోదీ మూడు మెట్రోలను ప్రారంభించారు. జూన్‌లో కొచ్చి మెట్రోను జాతికి అంకితం చేయగా..

నవంబర్‌లో హైదరాబాద్‌ మెట్రోను ఆవిష్కరించారు. ఇప్పుడు దిల్లీ మెట్రోలోని మరో మార్గాన్ని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com