పొగమంచు: ఉద్యోగులకు 'ఆలస్యం'పై వెసులుబాటు
- December 25, 2017
పొగమంచు నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ నుంచి కొంత ఊరట లభించింది. అటెండెంట్స్పై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు, ఉద్యోగులకు సూచించారు. వాతావరణ పరిస్థితులు బాగోనందున, పొగమంచు కారణంగా వేగంగా వాహనాలు నడిపితే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉండడంతో ఉద్యోగులకు హాజరు సమయం విషయంలో కొంత మినహాయింపునిచ్చారు. అబుదాబీ, దుబాయ్ తదితర ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు కూడా పొగమంచు వాహనదారుల్ని బాగా ఇబ్బంది పెట్టింది. షవమాక్, అల్ షమాఖ్, అల్ రహబాహ్, అల్ సహామా మరియు అల్ అయిన్ ఎయిర్పోర్టు ప్రాంతాల్లోనూ పొగమంచు బాగా ఎక్కువగా కనిపించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







