వెజ్ కీమా (కంద వేపుడు)...
- May 02, 2015
కావలసిన పదార్ధాలు:
- కంద - 1/4 కిలో
- నూనె - వేయించటానికి సరిపడా
- ఉల్లిపాయ - 2
- పచ్చిమిర్చి - 4
- అల్లం - 1 ఇంచి
- వెల్లుల్లి - 3 రెబ్బలు
- పసుపు - 1 టీ స్పూను
- పచ్చికారం - 1 టేబుల్ స్పూను
- గరంమసాల - 1 టేబుల్ స్పూను
- ఉప్పు - సరిపడా
- కొత్తిమీర – కొంచెం
చేయు విధానం:
- కంద ని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసి, కంద ముక్కలను నీరు పోయే దాకా (అనగా చిట్ చిట్ పోయేవరకూ) వేయించి చల్లారనివ్వండి.
- ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో కచ్చాపచ్చా గా నూరండి.
- ఇప్పుడు ఉల్లిపాయ + పచ్చిమిర్చి + అల్లం + వెల్లుల్లి ని ఒక పేస్టు గా నూరి పెట్టుకోండి.
- ఒక చిన్న మూకుడులో నూనె పోసి, పైన చెప్పిన పేస్టు ని పచ్చి వాసన పోయేదాకా వేయించండి.
- కచ్చాపచ్చా గా నూరిన ముక్కలను ఇందులో వేయండి.
- ఉప్పు, పసుపు, పచ్చికారం వేసి సన్నటి సెగ మీద ఒక 5 నిమిషాలు వేపండి.
- గరం మసాల వేసి మరో 5 నిమిషాలు మగ్గనివ్వండి.
- కొత్తిమీర చల్లి దించేయండి.
---- బి. మధుశ్రీ, అబుధాబి, యుఏయీ.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







