30 నిమిషాలు.. ఫ్యామిలీతో కుల్‌భూషణ్
- December 25, 2017
పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీఅధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను.. ఆయన తల్లి, భార్య కలుసుకున్నారు. సోమవారం ఉదయం ఇస్లామాబాద్ చేరుకున్న జాదవ్ ఫ్యామిలీసభ్యులు, పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. వాళ్ల వెంట భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ ఉన్నారు. దాదాపు 30 నిమిషాల సేపు జాదవ్‌తో మాట్లాడారు.
దాదాపు 21 నెలల తర్వాత జాదవ్ తన కుటుంబసభ్యులను కలుసుకున్నారు. కాగా ఈ సాయంత్రం ఫ్యామిలీ సభ్యులు భారత్‌కి తిరిగి వెళ్లారు. జాదవ్ తన కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలను పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా విడుదల చేసింది. అంతకుముందు పాక్ విదేశాంగ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి భారీ భద్రత మధ్య జాదవ్ తల్లి, భార్య అక్కడికి చేరుకున్నారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్, షార్ప్ షూటర్లను భద్రత కోసం నియమించారు.
గూఢచర్యం ఆరోపణల కింద పాక్‌లోని ఓ సైనిక కోర్టు ఏప్రిల్‌లో జాదవ్‌కు మరణశిక్ష విధించింది. ఐతే, భారత విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం ఈ శిక్షపై స్టే విధించింది. జాదవ్.. ఇరాన్ గుండా తమ బలూచిస్థాన్లోకి అక్రమంగా అడుగు పెట్టాడని, అందుకే అరెస్టు చేశామన్నది పాక్ వాదన. ఇరాన్లో బిజినెస్ చేసుకుంటున్న ఆయనను అపహరించి పాక్‌కు తీసుకెళ్లారని భారత్ చెబుబున్నమాట.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







