ప్రియుడితో నయన క్రిస్మస్
- December 26, 2017
నయనతార.. మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఈసారి కోరుకున్న ప్రియుడితో కలిసి క్రిస్మస్ ట్రీ ముందు నిలబడుతూ దిగిన సెల్ఫీ వైరల్ అయ్యింది. ఇంతకీ స్పెషలేంటి అంటూ చర్చించుకోవడం సినీలవర్స్ వంతైంది. నయనతార గ్లామర్ ఇండస్ర్టీలోకి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనికితోడు ఆమె నటించిన సినిమా ఈనెల 22న రిలీజైంది. అది కూడా హిట్ కావడంతో ఫుల్‌జోష్‌లో వుంది. అన్నట్లు ఈసారి క్రిస్మస్ వేడుకలను ఫ్యామిలీ, ప్రియుడితో కలిసి చెన్నైలోని కొత్త అపార్ట్మెంట్లో జరుపుకుంది.
విఘ్నేష్ శివన్ ఇచ్చిన సలహా మేరకు 10 అడుగుల పొడవున్న మంచు తరహాలోవున్న క్రిస్మస్ చెట్టుని దుబాయ్ నుంచి తెప్పించింది. ఇంట్లోనే ప్రియుడితో కలిసి దిగిన సెల్ఫీ ఇది. ఈ సందర్భంగా మ్యారేజ్ గురించి ఏదో ఒక విషయం రివీల్ చేస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం 'జై సింహా' వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుండగా, సైరా నరసింహారెడ్డిలోనూ కీలకపాత్ర పోషించనుంది నయనతార.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!