అనాధ పిల్లలకోసం.. ఫోటోగ్రఫీ వేలం
- December 26, 2017
అమెరికాలోని బే ఏరియాలో టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ అనాధ పిల్లలకోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టింది. క్యూపర్టినో లోని క్విన్ లాన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన నిధుల సేకరణకు ఎన్నారైల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా చిన్నారులు మ్యూజిక్, డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. దీనిలో భాగంగా ఫోటోగ్రఫీ వేలం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పలువురు.. నిరాశ్రయులైన విద్యార్ధులను ఆదుకునేందుకు తమవంతు సహాయం అందించారు. ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చిన నిధులతో అనాధ పిల్లలకు చదువు, సంగీతం, ఫోటోగ్రఫీ నేర్పిస్తామని టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తేజ్ గుండెవెల్లి తెలిపారు. ఈ కార్యక్రమానికి యుసి బర్కిలీ తోపాటు పలు సంస్థలు సహాకరించాయని నిర్వాహకులు వివరించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!