గుండెపోటుతో ప్రముఖ వ్యాపారవేత్త మనోజ్‌ భాటియా మృతి

- December 26, 2017 , by Maagulf
గుండెపోటుతో ప్రముఖ వ్యాపారవేత్త మనోజ్‌ భాటియా మృతి

మనామా: బహ్రెయిన్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన తట్టయ్‌ హిందూ మర్కంటైల్‌ కమ్యూనిటీ ప్రెసిడెంట్‌ మనోజ్‌ భాటియా, ముంబైలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బహ్రెయిన్‌లో ఆరు దశాబ్దాలపాటు ఆయన వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించారు. భాటియా కమ్యూనిటీ మెంబర్‌ అయిన మనోజ్‌, బహ్రెయిన్‌కి వచ్చి ఇక్కడే స్థిరపడ్డ భారతీయుల్లో ప్రముఖుడు. తట్టయ్‌ హిందు మర్కంటైల్‌ కమ్యూనిటీ, మనోజ్‌ భాటియా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. బహ్రెయిన్‌ ఫిలిప్పీన్స్‌ జాయింట్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫౌండర్‌ మెంబర్‌గా, బహ్రెయిన్‌ ఇండోనేసియా బిజినెస్‌ అండ్‌ ఫ్రెండ్షిప్‌ సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. బహ్రెయిన్‌ బిజినెస్‌ అసోసియేషన్‌ బోర్డ్‌ మెంబర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. బహ్రెయిన్‌ ఆసియన్‌ ట్రేడర్స్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారాయన. బహ్రెయిన్‌ ఇండియా సొసైటీ బోర్డ్‌ మెఒబర్‌గా, ఇండియన్‌ కమ్యూనిటీ రిలీఫ్‌ ఫండ్‌ అడ్వయిజర్‌గానూ సేవలందించారు మనోజ్‌ భాటియా. నారాయణా హోల్డింగ్‌ కంపెనీ డబ్ల్యుఎల్‌ఎల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అయిన మనోజ్‌, ట్రేడింగ్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, సర్వీసెస్‌ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com