మార్చి నుండి సినిమా థియేటర్స్ బంద్

- December 26, 2017 , by Maagulf
మార్చి నుండి సినిమా థియేటర్స్ బంద్

డిజిటల్ మరియు థియేటర్స్ లీజ్ విధానం పైన మార్చి 31 వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ డిమాండ్ చేస్తోంది. ఆ తేదీ కల్లా డిజిటల్ రేట్స్ తగ్గించకున్నా, థియేటర్స్ లీజ్ విధానం తీసివేయకపోయినా.. ఆరోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగులు, థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయంచుకున్నట్లు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ మరియు తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఛైర్మన్ ప్రతాని రామక్రిష్ణ గౌడ్ సెక్రటరి లయన్ సాయి వెంకట్ వైస్ ప్రసిడంట్ అలీ ఖాన్ పాల్గొన్నారు.

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఛైర్మన్ ప్రతాని రామక్రిష్ణ గౌడ్ మాట్లాడుతూ.. "మేము ఇండస్ట్రీ సమస్యల పై గత 15 సంవత్సరాలుగా పోరాడుతున్నాం.. చాలా కాలం నుంచి డిజిటల్ విధానం మరియు థియేటర్స్ రెంటల్ విధానం పైన పోరాటం సాగిస్తూ ఉన్నాం. ప్రక్క రాష్ట్రాల్లో ఉన్న విధానం మనకు రావాలి మన తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ చార్జీలు ఒక వారానికి ఒక షో అయిన దాదాపుగా 13 వేల రూపాయలు చార్జీ చేస్తున్నారు. ప్రక్క రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, బొంబాయి లలో ఒక వారానికి 2500 మాత్రమే ఉంది. ఈ రేటు మనకు కావాలి మరియు చిన్న సినిమాలకు అదనంగా 50 వేల రూపాయలు డిపాజిట్ చేపించుకుంటున్నారు ఈ విధానం వల్ల సెన్సార్ పూర్తి చేసుకున్న మూడు వందల సినిమాలు విడుదలకు నోచుకోలేదు. ఈ పరిస్థితికి కారణం మన తెలుగు ఇండస్ట్రీలో ఉండే ముగ్గురు, నలుగురు నిర్మాతలే.. వీళ్ళు కలిసి వేల మంది నిర్మాతల,డిస్ట్రిబ్యూటర్ల రక్తం తాగుతున్నారని వ్యక్తం చేస్తూ ఈ విధానం మారకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. రెండు రాష్ట్రాల నుండి డిస్ట్రిబ్యూటర్ల నుండి మంచి స్పందన వస్తుంది. దీనికి అందరు సహకరిస్తున్నారు" అన్నారు.

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ సెక్రటరి సాయి వెంకట్ మాట్లాడుతూ.. "తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆద్వర్యంలో మా ఛైర్మన్ గారు గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలపైన 7 రోజులు ఆమరణ నిరహర దీక్షకు దిగారు. తరువాత తెలంగాణ ఫిల్మ్ చాంబర్ మెంబర్స్ అందరం కలిసి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎదుట రిలే నిరహర దీక్షలు నిర్వహించాం. అప్పుడు.. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మంత్రులు మహెందర్ రెడ్డి, వేణుగోపాల చారి, బుర్ర నర్సయ్య గౌడ్, మెదక్ ఎమ్.పి.కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు హామి ఇచ్చి దీక్షను విరమింప చేయడం జరిగింది కానీ ఇప్పటికి సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పటికైనా తేరుకొని పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్ర ఉద్రుతం చేస్తామని" అన్నారు.

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వైస్ ప్రసిడంట్ అలీ ఖాన్ మాట్లాడుతూ.."మా ఛైర్మన్ తెలుగు ఫిల్మ్ చాంబర్ లో ఇ.సి. మెంబర్ గా ఉండి ప్రతి మీటింగ్‌లో ఈ సమస్యల గురించి మాట్లాడుతూ జరుగుతూనే ఉంది ఇప్పటికైనా తేలుకొని తెలుగు ఫిల్మ్ చాంబర్ సమస్యలపై నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వారికి తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రసిడంట్ జెమిని కిరణ్ సెక్రటరి ముత్యాల రాము గారికి కృతజ్ఞతలు" అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com