ఒమన్‌లో వలసదారుల వీసా కోసం కొత్త 'ఇ-సర్వీస్‌'

- December 26, 2017 , by Maagulf
ఒమన్‌లో వలసదారుల వీసా కోసం కొత్త 'ఇ-సర్వీస్‌'

మస్కట్‌: మ్యాన్‌ పవర్‌ మినిస్ట్రీని సంప్రదించకుండానే యజమానులు వలస కార్మికుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు వీలుగా వన్‌ డే ఆన్‌లైన్‌ సర్వీస్‌ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సుల్తానేట్‌లో నివసిస్తోన్న నాన్‌ ఒమనీ వర్కర్‌ ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి ఈ సర్వీస్‌ వెసులుబాటు కల్పిస్తుంది. ఐదు రియాల్స్‌ ఫీజుతోనే ఈ సేవల్ని పొందడానికి వీలుంటుందని మినిస్ట్రీ ఆన్‌లైన్‌ ద్వారా వెల్లడించింది. యజమాని ముందుగా ఇ-సర్వీస్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంటుంది. 'మేన్‌ పవర్‌ సర్వీస్‌ ట్రాన్స్‌ఫర్‌'లో రిజిస్టర్‌ అయ్యాక, అప్లికేషన్‌ని సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇ-మెయిల్‌, టెక్స్‌ట్‌ మెసేజ్‌ ద్వారా సర్వీస్‌ అలర్ట్స్‌ యజమానికి సమాచారం అందుతుంది. మినిస్ట్రీని సంప్రదించకుండానే ఆన్‌లైన్‌ ద్వారా ఈ సేవలు పొందే వీలు కలగడం చాలా గొప్ప విషయమని ఓ ప్రైవేటు సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న ఎస్‌ గుప్తా చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com