ఢోఫర్ లో దొంగతనాలకు పాల్పడిన నలుగురు ఒమాన్ పౌరులు అరెస్టు

- December 27, 2017 , by Maagulf
ఢోఫర్ లో దొంగతనాలకు పాల్పడిన నలుగురు ఒమాన్ పౌరులు అరెస్టు

మస్కట్: దొంగతనం ఆరోపణలపై నల్గురు ఓమనియులు అరెస్టయ్యారు,  సలాలా దాడిలో పోలీసు అధికారుల వేషంలో ఒక ఇంటిలో ప్రేవేశించి దొంగతనంకు పాల్పడ్డారు. సలాలా పోలీస్ సహకారంతో దోఫర్ పోలీస్ కమాండ్లో విచారణ మరియు క్రిమినల్ పరిశోధన విభాగం ఆ నల్గురు దొంగలను నిర్బధించాయి. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, "నల్గురు ఒమాన్  పౌరులు పోలీసుల మాదిరిగా మారువేషంలో  సలాలాలోని ఒక అపార్ట్మెంట్లో ప్రవేశించి, అక్కడివారి వద్ద నుంచి మొబైల్ ఫోన్ లను తీసుకొన్నారు. ఆ తర్వాత వారివద్ద నుంచి డబ్బును దొంగిలించి అక్కడి నుండి పారిపోయారు. " బాధితులు ఫిర్యాదు చేసిన తరువాత, పోలీసులు నేరస్తులను పెట్టుకొనేందుకు తీవ్ర యత్నం చేసి ఆ దొంగలను పట్టుకొన్నారు. " నిందితులు తమ నేరం ఒప్పుకున్నాడు. అలాగే గతంలోనూ ఇదే తరహాలో  మూడు నేరాలకు పాల్పడినట్లు అంగీకరిస్తూ అందుకు తమదే బాధ్యతవహించారు. నిందితులపై విచారణను పూర్తి చేయడానికి న్యాయ అధికారుల వద్దకు వారిని సూచించారు. "

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com