సంక్రాంతి కానుకగా 'రంగస్థలం' ఫస్ట్ లుక్

- December 27, 2017 , by Maagulf
సంక్రాంతి కానుకగా 'రంగస్థలం' ఫస్ట్ లుక్

మాస్ ఇమేజ్ నుంచి ఆల్ రౌండర్ ఇమేజ్ కు చేరుకోవడానికి డిఫరెంట్ నేపథ్య కథలను చెయ్యడానికి రామ్ చరణ్ రెడీ అయ్యాడు. ఈ మధ్య ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అలా వచ్చిన సినిమాల్లో గోవిందుడు అందరివాడేలే నిరాశపరిచినా చరణ్ నటనలో పరిణితి కనిపించింది అన్న పేరు తెచ్చుకున్నాడు, ధృవ మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వడంతో పాటు, చరణ్ కి పేరు తెచ్చిపెట్టింది. ఈ జోష్ లో రామ్ చరణ్ ఏకంగా 1985 బ్యాక్ డ్రాప్ తో, రంగస్థలం పేరుతో సినిమా చేయడానికి ధైర్యం చేశాడు. మైత్రీ మూవీస్ బ్యానర్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్ రెడీ క్లైమాక్స్ కి దగ్గరవుతోంది.

1985 కాలం నాటి గోదావరి జిల్లాలోని రంగస్థలం అనే గ్రామంలో జరిగే కథే ఈ రంగస్థలం మూవీ. సుకుమార్ తనదైన శైలిలో ఈ మూవీ తీస్తున్నాడు. పీరియాడిక్ సబ్జెక్ట్ కావడంతో అప్పటి కాలం నాటి వస్తువులు, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని ఎనభైల నాటి స్టైల్లోనే ఉండబోతున్నాయి. అందుకే సినిమా షూటింగ్ కాస్త లేటవుతుంది అంటున్నారు. చరణ్ ఇందులో గడ్డంతో కనిపించబోతున్నాడు. సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఆ మధ్య రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

రంగస్థలం మూవీని నిజానికి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాడు. కానీ షూటింగ్ లేటవడంతో మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రాకపోయినా మెగా అభిమానుల కోసం ఫస్ట్ లుక్ టీజర్ ని, పండగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారట. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com