అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న షాప్‌లు

- December 28, 2017 , by Maagulf
అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న షాప్‌లు

మనామా: మనామా సౌక్‌లోని నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో రెండంతస్తుల భవనంలో చెలరేగిన అగ్ని ప్రమాదం కారణంగా పలు షాప్‌లు అగ్ని కీలల్లో చిక్కుకుపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ మాణి జరగలేదు. మనామా డౌన్‌ టౌన్‌లోని షేక్‌ అబ్దుల్లా రోడ్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్‌ ఫైటింగ్‌ టీమ్స్‌ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేశాయి. ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. 49 మంది సభ్యులుగల ఫైర్‌ ఫైటింగ్‌ టీమ్స్‌ 13 వాహనాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉందని సివిల్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com