సౌదీలో ఒకేరోజు ఇద్దరు తెలంగాణ స్నేహితులు మృతి
- December 28, 2017
సౌదీ అబిరేయాలోని రియాద్‌లో జరిగిన ప్రమాదంతో జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం సౌదీ వెళ్లిన స్నేహితులు ఒకే రోజు మరణించారు.
మెట్‌పల్లికి చెందిన యాకుబ్ అలీ (48), అప్సర్ జానీ (47) స్నేహితులు. ఉపాధి కోసం ఇద్దరూ కలిసి 15 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు. రియాద్‌లోని జానీ రెడీమేడ్ వస్త్రవ్యాపారం ప్రారంభించగా, అలీ అతడితో ఉంటున్నాడు. బుధవారం యాకుబ్ అలీ గుండె పోటుతో మృతి చెందాడు.
అతడి మృతదేహాన్ని స్వగ్రామమైన మెట్‌పల్లికి తరలించేందుకు గురువారం ఉదయం జానీ, అతడి బంధువు యూసుఫ్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ఘటనలో జానీ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన యూసుఫ్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. స్నేహితులిద్దరూ ఒకే రోజు మరణించడంతో మెట్‌పల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







