హైదరాబాద్ లో చార్జ్ తీసుకున్న'రోబో పోలీస్'
- December 29, 2017
కొత్త సంవత్సర కానుకగా హైదరాబాద్‌లో రోబ్ పోలీస్ విధుల్లో చేరనుంది. పోలీసు విభాగంలో లేటెస్ట్ సాంకేతిక విధానాలతో రూపొందించిన రోబో పోలీస్‌ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ రోబో డిసెంబర్ 31 నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టులో విధులు నిర్వహించనుంది.
టీ-హబ్‌లో స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన 'హెచ్ బోట్స్' రోబోటిక్స్ కంపెనీ పోలీస్ రోబోను రూపొందించింది. ఈ రోబో పోలీసు అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు తీసుకుని కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది.అనుమానితులను, బాంబులను గుర్తిస్తుంది.
దుబాయ్‌లో వీల్స్ కదిలే రోబో పోలీసు విధులను నిర్వహిస్తుండగా.. ఇక్కడ దానికి భిన్నంగా నడిచేలా పోలీస్ రోబోను ‘హెచ్ బోట్స్’ రూపకల్పన చేసింది. ప్రపంచంలోనే రెండవ పోలీస్ రోబోగా గుర్తింపు పొందనున్న దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్టు రూపకర్తలు తెలిపారు. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో రోబో సేవలు విస్తరించాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







