రవితేజ `టచ్ చేసి చూడు` షూటింగ్ పూర్తి
- December 29, 2017మాస్ మహారాజా రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. .బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ నాయికలు.
నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ "మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. షూటింగ్ పూర్తయింది.ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది`` అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ, ఛాయాగ్రహణం : చోటా.కె.నాయుడు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







