బహ్రెయిన్‌లో ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌

- December 29, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌

మనామా: డిస్కవర్‌ ఇస్లామ్‌, ఆస్టర్‌ మెడికల్‌ సెంటర్‌ బహ్రెయిన్‌ సంయుక్తంగా ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌ని ఈ రోజు నిర్వహిసుతన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరైతే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో, అలాంటివారందరికీ ఉచితంగా తమ మెడికల్‌ క్యాంప్‌లో ఉచితంగా వైద్య పరీక్షలు అందుతాయని తెలిపారు. జనరల్‌ ప్రాక్టీషనర్‌, డెంటిస్ట్‌, గైనకాలజిస్ట్‌ ఈ క్యాంప్‌లో అందుబాటులో ఉంటారు. ఆస్టర్‌ మెడికల్‌ సెంటర్‌ గుడైబాలో ఈ మెడికల్‌ క్యాంప్‌ ఉదయం 8 గంటల నుంచి 11 రాత్రి గంటల వరకు నిర్వహించబడుతుంది. కన్సల్టేషన్‌, బిపి, షుగర్‌, బాడీ మాస్‌ ఇండెక్స్‌ పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. క్యాంప్‌కి హాజరయ్యేవారికి ఆస్టర్‌ ప్రివిలేజ్‌ కార్డ్‌ (డిస్కౌంట్‌ కార్డ్‌) కూడా అందజేయబడుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com