ఎస్‌బిఐ బహ్రెయిన్‌కి సిసా సెక్యూరిటీ సర్టిఫికేషన్‌

- December 29, 2017 , by Maagulf
ఎస్‌బిఐ బహ్రెయిన్‌కి సిసా సెక్యూరిటీ సర్టిఫికేషన్‌

మనామా: ఎస్‌బిఐ బహ్రెయిన్‌, పేమెంట్‌ కార్డ్‌ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్‌ (పిసిఐ డిఎస్‌ఎస్‌వి 3.2) సర్టిఫికేషన్‌ పొందింది. జిసిసి దేశాల్లోనే అతి పెద్ద క్యుఎస్‌ఎ కంపెనీ అయినా సిసా ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ డబ్ల్యుఎల్‌ఎల్‌ నుంచి ఈ అవార్డుని ఎస్‌బిఐ అందుకుంది. బహ్రెయిన్‌లోని రిటైల్‌ బ్యాంకింగ్‌ బ్రాంచ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సిసా ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ వరల్డ్‌ వైడ్‌ సిఇఓ మరియు ఫౌండర్‌, దర్శన్‌ శాంతమూర్తి సర్టిఫికెట్‌ని సిఇఓ ప్రభా సింగ్‌కి అందజేశారు. మెవనా రీజియన్‌ ఆఫ్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజినల్‌ హెడ్‌ టివిఎస్‌ రమణారావు సమక్షంలో ఈ అవార్డు అందజేయడం జరిగింది. కంట్రీ హెడ్‌ మరియు సిఇఓ ఎస్‌బిఐ, డబ్ల్యుబిబి బహ్రెయిన్‌ షమ్షేర్‌ సింగ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్‌ స్టిమ్స్‌ అలాగే కార్డ్‌ డేటా, భద్రత వంటి విభాగాల్లో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే ఎస్‌బిఐ బహ్రెయిన్‌కి ఈ గుర్తింపు దక్కిందని ప్రతినిథులు వివరించారు. విపి (ఆపరేషన్స్‌) అమిత్‌ షర్మ, ఎవిపి (సిస్టమ్స్‌ అనంత్‌, సిస్టమ్స్‌ ఆఫీసర్‌ శంకర్‌ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com