ఒమన్ లో తీవ్రమైన గాయాలతో హత్యకు గురైన వ్యక్తి..ఘాలలో మృతదేహం లభ్యం

- December 29, 2017 , by Maagulf
ఒమన్ లో తీవ్రమైన గాయాలతో హత్యకు గురైన వ్యక్తి..ఘాలలో మృతదేహం లభ్యం

మస్కట్ : ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి హత్య చేసి మృతదేహాన్ని దూరంగా పారవేసి ఓ అయిదుగురు నిందితులు చేతులను దులుపుకొన్నారు. అయితే చేసిన పాపం వెంటాడక తప్పదని మరోమారు రుజువు కాబడింది. ఘాలలో మృతదేహం కనుగొన్న తర్వాత  రాయల్ ఒమన్ పోలీసులు ఆ హంతకులను అరెస్టు చేశారు. మస్కట్  ప్రావిన్స్ పోలీసు కమాండర్ బుచర్ రాష్ట్రంలోని ఘలా పారిశ్రామిక ప్రాంతంలో హత్యకు పాల్పడినందుకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రాయల్ ఒమన్ పోలీసులతో ఒక అధికారి మాట్లాడుతూ అల్-''అతిబా పోలీసు స్టేషన్ నివేదికను స్వీకరించిన తరువాత ఘలా ఇండస్ట్రియల్ జోన్లో ఎడారిలో ఒక ప్రాకారంతో ఉన్న ప్రదేశంలో రక్తపు గాయాలతో నేలమీద పడి ఉన్న స్థితిలో  దారుణ హత్యకు గురైన ఒక గుర్తు తెలియని శవం  కనిపించిందని తమకు ఒక సమాచారం అందిందని దానితో సంఘటనాస్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించి హత్య చేసిన అయిదుగురు నిందితులను కీలకాధారాలతో సహా  పట్టుకోవడం జరిగిందన్నారు. ఆ ఆరుగురి మధ్య నెలకొన్న ఒక వివాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిందని ఆయన తెలిపారు. హతుడిని మిగిలినవారంతా తీవ్రంగా కొట్టారు. గాయపడిన ఆ ప్రతివాది అదేరాత్రి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. తేరుకున్న నిందితులు మృతశరీరాన్ని తీసుకొని  ఎడారి ప్రాంతంలోనికి దారి తీసే గోడలు ఉన్న వీధిలోకి విసిరి పరారయ్యారు.ఈ ఐదుగురు అనుమానితులను విచారణ నిమిత్తం న్యాయ అధికారులకు వద్దకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com