పుల్వామా సీఆర్పీఎఫ్ కేంద్రంపై ఉగ్రదాడి
- December 30, 2017
కల్లోల కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై మెరుపుదాడికి తెగబడ్డారు. క్షణాల్లో తేరుకున్న భద్రతా సిబ్బంది ఉగ్రమూకలకు ధీటుగా జవాబిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల నుంచి ఎడతెగని కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం కాల్పుల్లో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
గ్రెనేడ్లు విసిరి బీభత్సం.. : తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పుల్వామా జిల్లా కేంద్రంలోని 185వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు.. తొలుత గ్రెనేడ్లు విసిరి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. వెంటనే తురుకున్న భారత బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. క్యాంప్‌లోని ఓ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులు ఉండి ఉండొచ్చని భద్రతా సిబ్బంది భావిస్తున్నారు.
టార్గెట్ పుల్వామా : సరిహద్దుకు సమీపంలోని పుల్వామా జిల్లాపై తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గత ఆగస్టులో పుల్వామా పోలీస్ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది సిబ్బంది చనిపోయిన సంగతి తెలిసిందే. దాదాప 12 గంటల ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆ తర్వాత రెండు నెలలకే శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని బీఎస్‌ఎఫ్ క్యాంపు సమీపంలో పేలుడు, కాల్పులు చోటుచేసుకున్నాయి. తాజా దాడికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







