అమెరికాలో పలుచోట్ల కాల్పులు, ఐదుగురు మృతి
- December 30, 2017
అమెరికాలోని పలు ప్రాంతాల్లో కాల్పులు ఘటనలు కలకలం రేపింది. అమెరికాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. దక్షిణ కాలిఫోర్నియాలోని లాంగ్‌బీచ్‌లో ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు దిగాడు.
పనిలో ఉన్న ఉద్యోగులు కాల్పుల శబ్దం విని పరుగులు తీశారు. కొందరు డెస్క్‌ల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, తర్వాత దుండగుడిని పోలీసులు హతమార్చారు. అలాగే హూస్టన్‌లో జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
ఓ ఆటోషాప్‌లో గతంలో పనిచేసి మానేసిన ఓ వ్యక్తి శుక్రవారం సాయంత్రం షాపులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపిన దుండగుడు బయటకు వచ్చి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాల్పులకు పాల్పడిన వారు ఎవరై వుంటారనే దానిపై పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







