ఫ్రాన్స్ లో 22 భారతీయ మైనర్ల అదృశ్యం

- December 30, 2017 , by Maagulf
ఫ్రాన్స్ లో 22 భారతీయ మైనర్ల అదృశ్యం

రగ్బీ శిక్షణ కోసం ఫ్రాన్స్‌కు వెళ్లిన 22 మంది భారతీయ మైనర్లు అదృశ్యమయ్యారు. ఘటనకు కారకులైన ట్రావెల్‌ ఏజెంట్ల పై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వారి నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. సీబీఐ ప్రతినిధి అభిషేక్‌ దయాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెంచ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పారిస్‌ ఆహ్వానం పై 25 మంది మైనర్లను నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్‌ ఏజెంట్లు పారిస్‌కు తీసుకెళ్లారు. ఇందుకుగాను మైనర్ల తల్లిదండ్రుల నుండి 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. పారిస్‌కు వారిని తీసుకెళ్లిన తర్వాత ఒక వారం పాటు రగ్బీ ట్రైనింగ్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. 

కానీ వారి తిరుగు ప్రయాణానికి ట్రావెల్‌ ఏజెంట్లు టికెట్లు రద్దు చేశారు. కాగా ఇద్దరు పిల్లలు మాత్రం ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే మిగతా వారిని స్థానిక గురుద్వారాలో ఉంచినట్టు సమాచారం. అందులో ఒకరిని ఫ్రెంచ్‌ పోలీసులు పట్టుకొని ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఇంటర్‌పోల్‌..సీబీఐకి తెలిపింది. దీంతో సీబీఐ విచారణ ప్రారంభించింది. ట్రావెల్‌ ఏజెంట్లలో ఫరీదాబాద్‌కు చెందిన లలిత్‌ డేవిడ్‌ డీన్‌, ఢిల్లీకి చెందిన సంజరు రారు, వరుణ్‌ చౌదరీల నుండి సీబీఐ పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com