సౌదీ చేరుకున్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌

- December 31, 2017 , by Maagulf
సౌదీ చేరుకున్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌

శనివారం తమ దేశం నుండి బయల్దేరిన పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ సౌదీ అరేబియాకు చేరుకున్నారని పిఎంఎల్‌- ఎన్‌ వర్గాలు తెలిపాయి. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సంస్థలో ఆయన రియాద్‌కు చేరుకున్నారని పార్టీ వర్గాలు వివరించాయి. ఈ పర్యటనలో ఆయన సౌదీ రాజు సల్మాన్‌, యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటీ అయి ప్రధానమైన అంశాలను చర్చించనున్నారని పిఎంఎల్‌-ఎన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. పనామా పత్రాల కుంభకోణంలో పేరు బయటకు రావటంతో గత జులై 28న పాక్‌ సుప్రీంకోర్టు నవాజ్‌షరీఫ్‌పై అనర్హత వేటు వేయటంతో ఆయన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com