కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి

- December 31, 2017 , by Maagulf
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి

సెంట్రల్‌ కెన్యాలో ఆదివారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది మరణించగా మరో 16 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. సెంట్రల్‌ కెన్యాలో నకురు పట్టణం వద్ద స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో ఒక బస్సు, లారీ ఢకొీన్న ఈ ప్రమాదంలో 30 మంది మర ణించారని రిఫ్ట్‌ వ్యాలీ ట్రాఫిక్‌ పోలీస్‌ చీఫ్‌ జెరో అరోమ్‌ చెప్పారు. శిథిలాల నుండి మృతదేహాలను తొలగించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని ఆయన వివరిం చారు. కెన్యా పశ్చిమ ప్రాంతంలోని బుసియా నుండి ఈ బస్సు ప్రయాణిస్తున్న నకురు ఎల్డోరెట్‌ హైవైపై ప్రమాదకరమైన మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. ఈ మలుపు వద్ద ఈ నెలరోజుల వ్యవధిలో జరిగిన ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య 100కు చేరిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com