కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి
- December 31, 2017
సెంట్రల్ కెన్యాలో ఆదివారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది మరణించగా మరో 16 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. సెంట్రల్ కెన్యాలో నకురు పట్టణం వద్ద స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో ఒక బస్సు, లారీ ఢకొీన్న ఈ ప్రమాదంలో 30 మంది మర ణించారని రిఫ్ట్ వ్యాలీ ట్రాఫిక్ పోలీస్ చీఫ్ జెరో అరోమ్ చెప్పారు. శిథిలాల నుండి మృతదేహాలను తొలగించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని ఆయన వివరిం చారు. కెన్యా పశ్చిమ ప్రాంతంలోని బుసియా నుండి ఈ బస్సు ప్రయాణిస్తున్న నకురు ఎల్డోరెట్ హైవైపై ప్రమాదకరమైన మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. ఈ మలుపు వద్ద ఈ నెలరోజుల వ్యవధిలో జరిగిన ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య 100కు చేరిందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







