'బాందేవ్'గా రానా ఫస్ట్‌లుక్.!
- December 31, 2017
దగ్గుబాటి రానా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'హాథీ మేరే సాథీ'. 1971లో హిందీలో ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది.
ఇందులో రానా ఏనుగు తొండాన్ని పట్టుకుని నిలబడిన స్టిల్ ఆకట్టుకుంటోంది. పాత చిత్రంలో హిందీలో రాజేశ్ ఖన్నా, తనూజ జంటగా నటించగా... తెలుగులో రానాకు జోడీగా ఎవరు నటించనున్నారన్నది తెలియాల్సి ఉంది. ఇందులో రానా బాందేవ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రభు సొలోమాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.
దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోపక్క రానా'1948' చిత్రంతో బిజీగా ఉన్నారు. మలయాళంలో 'రాజా మార్తాండ వర్మ' అనే చారిత్రాత్మక సినిమాలోనూ రానా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







