కస్టమ్స్‌ ఈ-పేమెంట్‌ యాక్టివేటెడ్‌

- December 31, 2017 , by Maagulf
కస్టమ్స్‌ ఈ-పేమెంట్‌ యాక్టివేటెడ్‌

మనామా: కస్టమ్స్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా, ఇ-పేమెంట్‌ యాక్టివేషన్‌ని ప్రకటించారు. క్రెడిమ్యాక్స్‌ సహకారంతో కస్టమ్స్‌ పోర్ట్స్‌ వద్ద ఈ ఈ-పేమెంట్‌ అందుబాటులో ఉంటుంది. 2017-2020 కస్టమ్స్‌ ఎఫైర్స్‌ స్ట్రేటజీలో భాగంగా ఈ ఈ-పేమెంట్‌ యాక్టివేషన్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. బహ్రెయిన్‌ దినార్‌, సౌదీ రియాల్స్‌లో ఈ-పేమెంట్‌ చెయ్యడానికి వీలుంది. అయితే 500 బహ్రెయినీ దినార్స్‌ వరకు ఈ-పేమెంట్‌ చేయొచ్చు. ఈ-పేమెంట్‌ ద్వారా చెల్లింపులతో వర్క్‌ ఎఫీషియన్సీ పెరుగుతుంది, అదే సమయంలో సమయం కూడా తగ్గుతుంది. ప్రస్తుతానికి ఏడు డివైజ్‌లను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com