బ్రిటన్:1600 కార్లు అగ్నికి ఆహుతి

- January 01, 2018 , by Maagulf
బ్రిటన్:1600 కార్లు అగ్నికి ఆహుతి

బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో భారీ అగ్నిప్రమాదం లివర్‌పూల్: బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో ఓ కార్ పార్కింగ్ ఏరియాలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 1,600 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. 11 వేల మంది కూర్చొనే వీలున్న లివర్‌పూర్ మైదానంలో అంతర్జాతీయ గుర్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రదర్శనను చూడటానికి వచ్చిన ప్రేక్షకులు తమ వాహనాలను బహుళ అంతస్తుల పార్కింగ్ ఏరియాలో నిలిపారు. మూడో అంతస్తులోని ఒక కారులో చెలరేగిన మంటలు మిగతా వాహనాలకు క్షణాల్లో అంటుకున్నాయి. దీంతో మొదటి అంతస్తులో ఉన్న గుర్రాలు మైదానంలోకి పరుగెత్తాయి. ప్రేక్షకులు సైతం మైదానంలోకి ఉరుకులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. సహాయ సిబ్బంది సమీప అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదం కారణంగా ప్రదర్శన రద్దుకావడంతో ప్రేక్షకులు తమ వాహనాలను అక్కడే వదిలేసి ఇండ్లకు చేరారు. మంటల్లో కాలిపోతున్న వాహనాల పగిలిన అద్దాలు, ఎయిర్‌బ్యాగులు పేలిన శబ్దాలు తెల్లవార్లు వినిపిస్తునే ఉన్నాయి.

భారీగా మంటలు, పొగ వ్యాపిస్తుండటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com