రాంగోపాల్ వర్మకు కౌంటర్ ఇచ్చిన గీతామాధురి
- January 02, 2018
నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ న్యూ ఇయర్ సందర్బంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకోవడం ఒకవిధమైన టైం వేస్ట్ ప్రక్రియేనని, ఉచితంగా మెసేజ్‌లు పెట్టి "హ్యాపీ న్యూ ఇయర్" అంటూ చెప్పుకోవడంకన్నా చేతిలో ఒక విలువైన బహుమతి లేదా డబ్బు పెట్టి గ్రీటింగ్స్ చెప్పుకోవడం మంచిదన్నారు. ఇతరుల శ్రేయస్సును కోరే వారే అయితే ఉచిత మెసేజ్‌లను మాని ఇలా చేయాలని సూచించాడు.
వర్మ వ్యాఖ్యలకు సింగర్ గీత మాధురి ఘాటు రిప్లై ఇచ్చారు. నవ్వుతూ బతకడంలో ఖర్చు లేదని, తన వరకు అయితే ప్రతి రోజూ ప్రత్యేకమైనదేనని పేర్కొంది. న్యూ ఇయర్ విషెస్ చెప్పడమంటే ఎదుటి వారిని ప్రోత్సహించడమేనని, ఆలా చెప్పడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఇలా కాకుండా డబ్బుతోనో, బహుమతులతోనో వారిని తృప్తి పరిచినప్పుడు ఇది తర్వాత ప్రతికూలంగా మారె అవకాశముందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







