ఊచకోతకు పాల్పడ్డ ఆర్మీ మాజీ ఆఫీసర్

- January 02, 2018 , by Maagulf
ఊచకోతకు పాల్పడ్డ ఆర్మీ మాజీ ఆఫీసర్

పల్వాల్ : హర్యానాలో దారుణం జరిగింది. పల్వాల్‌లో ఆర్మీ మాజీ ఆఫీసర్ ఊచకోతకు పాల్పడ్డాడు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఒక ఐరన్ రాడ్డుతో ఆరుగుర్ని కొట్టి చంపాడు. పల్వాల్‌లో ఈ హత్యాకాండ చోటుచేసుకున్నది. ప్రస్తుతం వ్యవసాయశాఖలో సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల నరేశ్ కదియన్ ఈ హత్యలకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ హత్యలు జరిగినట్లు తేల్చారు. నరేశ్ గత కొన్నాళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. భార్యా పిల్లలు ప్రస్తుతం నరేశ్‌కు దూరంగా ఉంటున్నారు. 2003లో ఆర్మీ లెఫ్టినెంట్ ఉద్యోగం నుంచి నరేశ్ వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2015లోనూ ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో ఆయన గొడవకు దిగారు. ఇవాళ చనిపోయినవారిలో ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com