గజల్‌ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..

- January 02, 2018 , by Maagulf
గజల్‌ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..

లైంగిక వేధింపుల కేసులో గజల్‌ శ్రీనివాస్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న పనిమనిషి పార్వతిని విచారణకు హాజరు కావాలని పిలిచారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఎంత వరకు ఉందనే దానిపై ఆరా తీయనున్నారు. ప్రధానంగా బాధితురాలు పార్వతిపై ఆరోపణలు చేసింది. తనను గజల్‌ శ్రీనివాస్‌తో గడపాలని ఒత్తిడి చేసిందని చెప్పింది. దీనిపైనా ఆమెను ప్రశ్నించనున్నారు. అలాగే ఆలయ వాణి మాజీ ఉద్యోగుల్ని కూడా విచారణకు హాజరు కావాలని పిలిచినట్లు తెలుస్తోంది. ఇటు గజల్‌ బెయిల్‌ పిటిషన్‌, పోలీసు కస్టడీ పిటిషన్లు నేడు విచారణకు రానున్నాయి. ఈ కేసులో ఏ-1గా ఉన్న గజల్‌ను ప్రశ్నిస్తే మరిన్ని వాస్తవాలు బయటపడతాయంటున్నారు పోలీసులు. అందుకే అతడ్ని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. ఇంకా బాధితులెవరైనా ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయొచ్చంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com