నైజీరియా మసీదులో ఆత్మాహుతి దాడి 11 మంది మృతి

- January 03, 2018 , by Maagulf
నైజీరియా మసీదులో ఆత్మాహుతి దాడి 11 మంది మృతి

అబూజ : బోర్నో రాష్ట్రంలో గాంబౌరు నగరంలోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది.ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...బుధవారం తెల్లవారుజామున గాంబౌరు నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో ప్రార్థన చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మృతదేహాలన్నీ మసీదు ఆవరణలో చల్లాచదురైపడిపోయాయి. 
భారీ పేలుడు కారణంగా పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. మసీదు భవనం తునాతునకలైంది. మసీదు శిధిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండివుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో ముమ్మర సహాయక చర్యలు చేపట్టామని అన్నారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా, గతవారం మైదుగురీ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు పౌరులు మృతి చెందారు.

ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు బోకో హారమ్‌ మిలిటెంట్లు ప్రకటించుకున్నారు. గతేడాది నవంబర్‌లో నైజీరియా మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 50 మంది మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com