యు.ఏ.ఈ లో వీకెండ్‌ వెదర్‌

- January 03, 2018 , by Maagulf
యు.ఏ.ఈ లో వీకెండ్‌ వెదర్‌

యు.ఏ.ఈ:యు.ఏ.ఈ లో ఈ వీకెండ్‌ కూల్‌ వెదర్‌ ఉండొచ్చని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ (ఎన్‌సిఎం) పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో అత్యల్పంగా 8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆకాశం కొంతమేర మేఘావృతం అయి ఉంటుందనీ, సాధారణం నుంచి ఓ మోస్తరుగా గాలుల తీవ్రత ఉంటుంని, సముద్ర తీర ప్రాంతాల్లో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని ఎన్‌సిఎం పేర్కొంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా ఎక్కువ ఉంటుంది, అలాగే మిస్ట్‌ ఫార్మేషన్‌ కూడా ఏర్పడవచ్చు. అత్యధికంగా 28 డిగ్రీల సెల్సియస్‌, అత్యల్పంగా 8 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. అరేబియన్‌ గల్ఫ్‌ మరియు ఒమన్‌ సీలలో రఫ్‌ నుంచి మోడరేట్‌ పరిస్థితులుంటాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా కనిపిస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com