జెరూసలేం అమ్మకానికి లేదు: పాలస్తీనా
- January 04, 2018
జెరూసలేం: 'జెరూసలేం అమ్మకానికి లేదు.' అని పాలస్తీనా వ్యాఖ్యానించింది. తాము సాయం చేస్తున్నప్పటికీ తమ పట్ల గౌరవం కానీ కనీసం అభినందించడం కూడా లేదని ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పాలస్తీనా విమోచన సంస్థ నేత హనన్ అష్రావి బుధవారం స్పందిం చారు. శాంతి పట్ల వాటి ప్రయోజనాల పట్ల అమెరికాకు నిజంగా ఆసక్తి వుంటే ముందు వాటికి కట్టుబడాలని కోరారు. పాలస్తీనియన్లను ఎన్నటికీ బ్లాక్ మెయిల్ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ట్రంప్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలను పాలస్తీనా తీవ్రంగా ఖండించింది. కాగా, ట్రంప్ ప్రకటనను ఇజ్రాయిల్ అధికారులు స్వాగతించారు. తాము కూడా పాలస్తీనియన్లపై ఒత్తిడి పెంచు తామని తెలిపారు. అయితే ఈ చర్య వల్ల గాజాలో మానవతా సంక్షోభం నెలకొనే ప్రమాదముందని ప్రతిపక్ష నేత త్జిపి లివిని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!