భారతదేశంలో నిరసనలు...ఒమాన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సలహా
- January 04, 2018
మస్కట్: భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ముంబయిలో ఉన్న ఒమాని రాయబార కార్యాలయం భారత్ లో తన పౌరులకు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. ముంబైలోని ఒమన్ కాన్సులేట్ ఒమాన్ పౌరులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వారు బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఓమనియులు అవసరమైతే అ00912222876037/38 రాయబార కార్యాలయాన్ని సంప్రదించండని కాన్సులేట్ అధికారిక ప్రకటన బుధవారం తెలిపింది. కొరేగావ్-భీమా గ్రామంలో జనవరి 1న జరిగిన వేడుకల సమయంలో లక్ష మందికి పైగా దళితులు హాజరయ్యారు. 200 ఏళ్ల క్రితం ఆంగ్లో-మరాఠా యుద్ధం జరిగింది. పీష్వా బాజీరావు-2 సైన్యానికి, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన చిన్న సైన్యానికి మధ్య ఆనాడు భయానక పోరాటం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీలోని సైన్యంలో ఎక్కువ మంది దళితులే ఉండేవారు. నాటి యుద్ధంలో అనేక మంది దళిత సైనికులు మృతి చెందారు. వారి స్మారకార్థం బ్రిటిష్ వారు సన్సవాడి గ్రామంలో 'విజయ స్థూపం' ఏర్పాటు చేశారు. 200వ వార్షికోత్సవం సందర్భంగా సుమారు లక్ష మంది దళితులు స్మారక స్థూపం వద్దకు చేరుకున్న తరుణంలో దళితులపై రాళ్ల వర్షం కురిసింది. కాషాయి జెండాలు ధరించిన రైట్‌వింగ్ సంస్థలే ఈ రాళ్ల దాడికి దిగారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. తాజాగా మృతుల సంఖ్య రెండుకు చేరినట్టు తెలుస్తోంది. ఈ ఘటన మంగళవారంనాడు ముంబైని అట్టుడికించగా, బుధవారం మహారాష్ట్ర బంద్‌కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ తర్వాత జరిగిన హింసాకాండలో ఒక వ్యక్తి మరణించినట్లు పోలీసులు చెప్పారు. అప్పటి నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కొల్హాపూర్, పర్భాని, లాతూర్, అహ్మద్ నగర్, ఔరంగాబాద్, హింగోలి, కొల్హాపూర్, నాందేడ్, థానే జిల్లాలతో నిరసనలు జరిగాయి. మంగళవారం రాష్ట్ర రాజధాని ముంబైకి వ్యాపించిన నిరసనలు, వాహనాలు తగలబడిపోయాయి. అంతేకాకుండా, బుధవారం నుంచి మరింత నిరసనలు జరగనున్నట్లు ఇది ఒమనీ కాన్సులేట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ కారణంతోనే భారత్ లో ఉన్న ఒమాన్ పౌరులకు జాగ్రత్తలు సూచిస్తూ ఒక సలహాను విడుదల చేశారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







