బీఎస్‌ఎఫ్ కాల్పుల్లో 12 మంది పాకిస్తాన్ రేంజర్ల హతం
- January 04, 2018
జమ్ము కాశ్మీర్:జమ్ము కాశ్మీర్ సాంబా సెక్టార్‌లో రెచ్చిపోతున్న పాక్ రేంజర్లకు బీఎస్ఎఫ్ దళాలు గట్టిగా జవాబు చెప్పాయి. ఎల్‌ఓసీలోని మూడు పాక్ పోస్టులను ధ్వంసం చేసిన భారత జవాన్లు 12 మంది పాక్ రేంజర్లను మట్టుబెట్టారు. బుధవారం నుంచి సాంబా సెక్టార్‌లో పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. వారి కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఒక జవాన్ కూడా అమరుడయ్యాడు. దీంతో ఉదయం పాక్ పోస్టులపై విరుచుకుపడ్డ బీఎస్‌ఎఫ్ జవాన్లు విధ్వంసం సృష్టించారు.
ఉదయం ఐదున్నర నుంచి ఎల్‌ఓసీలో భారత జవాన్లు కాల్పులు ప్రారంభించారు. పాక్ వైపు నుంచి వచ్చిన మూడు మోర్టార్ పొజిషన్స్ గుర్తించిన జవాన్లు వాటిని టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపించాయి. ధ్వంసం చేశాయి. ఎల్‌ఓసీ లోంచి భారత్‌లోకి చొరబడుతున్నఒకరిని కాల్చిచంపాయి. బీఎస్ఎఫ్ కాల్పుల్లో 12 మంది పాక్ రేంజర్లు హతమైనట్టు సరిహద్దు భద్రతా దళం ప్రతినిధి ప్రకటించారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







