పక్కనే భార్య, విమానంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలు: ఎన్‌ఆర్‌ఐ అరెస్ట్

- January 05, 2018 , by Maagulf
పక్కనే భార్య, విమానంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలు: ఎన్‌ఆర్‌ఐ అరెస్ట్

అమెరికా: భారత సంతతికి చెందిన ప్రభు రామ్మూర్తి అనే 34 వ్యక్తి విమానంలో తన పక్కనే నిద్రలో ఉన్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్టు చేశారు.

లాస్‌వెగాస్ నుండి డెట్రాయిట్‌కు విమానంలో వెళ్తున్న సమయంలో గురువారం నాడు ఈ ఘటన చోటు చేసుకొందని మిచిగాన్ పోలీసులు తెలిపారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రామ్మూర్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు

తాను నిద్రలో ఉన్న సమయంలో బాధితురాలి చొక్కా, ప్యాంట్ గుండీలు తీసి ఉన్నాయి. తనకు మెలకువ వచ్చేసరికి బాధితురాలి ప్యాంట్ లోపల రామ్మూర్తి చేతులున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు.

బాధితురాలు మెలకువ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గమనించింది విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది.అయితే రామ్మూర్తి పక్కనే ఆయన భార్య ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రామ్మూర్తితో పాటు ఆయన భార్య కూడ టెంపరరీ వీసాపై అమెరికాలో నివాసం ఉంటున్నారు.రామ్మూర్తి రెండున్నర ఏళ్ళుగా ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి అభియోగాలు లేవని రామ్మూర్తి లాయర్ కోర్టులో తన వాదనను విన్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com